
* చర్చలు విఫలం కావడంతో సమ్మె యధాతథం
ఆకేరున్యూస్, ఢిల్లీ: బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్లు నెరవేర్చాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్స్‌తో జరిగిన చర్చలు విఫలమయ్యాయని బ్యాంకు యూనియన్లు తెలిపాయి. దీంతో ప్రణాళిక ప్రకారం మార్చి 24- 25 తేదీల్లో యథావిధిగా సమ్మె జరుగుతుందని స్పష్టం చేశాయి. ఐబీఏతో జరిగిన సమావేశంలో అన్ని కేడర్లలో నియామకాలు, ఐదు రోజుల పని దినాలు వంటి సమస్యల్ని యూఎఫ్‌బీయూ సభ్యులు లేవనెత్తారు. వీటిపై జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈ సమస్యలపై ఎటువంటి పరిష్కారం లభించలేదని నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ అన్నారు. అందుకే ముందు ప్రకటించినట్లుగానే రెండు రోజుల పాటు సమ్మె ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వర్క్‌మెన్, ఆఫీసర్ డైరెక్టర్ పోస్టుల్ని భర్తీ చేయడం వంటి డిమాండ్లతో యూఎఫ్‌బీయూ తొలుత సమ్మెను ప్రకటించింది. ఉద్యోగుల పనితీరుపై సవిూక్షలు, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలకు సంబంధించి ఇటీవల జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కూడా ఈ యూనియన్లు కోరుతున్నాయి. ఇటువంటి చర్యలు ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగిస్తాయని ఆరోపిస్తున్నాయి. యూఎఫ్‌బీయూలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్తాయీస్ ఆపోసియేషన్. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ వంటి ప్రధాన బ్యాంకు సంఘాలు ఉన్నాయి.
………………………………..