
* ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విద్యా బోధన అవసరం
* జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ఆకేరున్యూస్, భూపాలపల్లి: ప్రాథమిక పాఠశాలల విద్యార్థులలో అభ్యసన సామర్ధ్యాల పెంపునకు కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ విద్యాబోధన ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శనివారం భూపాలపల్లి మండలం గుర్రంపేట ఎంపీపీఎస్ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యాబోధన కార్యక్రమాన్ని జిల్లాలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో విద్యా బోధన కార్యక్రమం నిర్వహణపై ఈ నెల 11న రాష్ట్రస్థాయిలో ఒక రోజు క్వాలిటీ కోఆర్డినేటర్స్ మరియు జిల్లాస్థాయి రిసోర్స్ పర్సన్ లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు మెరుగైన సామర్థ్యాలు అనగా చదవడం, రాయడం, లెక్కించడం వంటి ప్రక్రియలలో మెరుగుపరచడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. ఎఫ్.ఎల్.ఎన్ కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించడంలో భాగంగా కృతృమ మేధతో విద్యా బోధన ప్రత్యేక సాఫ్ట్ వేర్ తో విద్యార్థులను ఆకట్టుకునే విధంగా ఈ కార్యక్రమం రూపొందించబడినట్లు తెలిపారు. 3, 4, 5వ తరగతులు అభ్యసిస్తున్న విద్యార్థులకు భాష, గణితంపై కృత్రిమ మేధ ఏఐ ద్వారా పాఠాలు బోధిస్తారని సూచించారు. ఈ తరహా బోధన ద్వారా విద్యార్థి స్థాయిని పరీక్షించి వారి స్థాయికి అనుగుణంగా సులభతరం నుండి కఠినతరం వరకు విద్యాబోధన జరుగుతుందని తెలిపారు. ఈ విద్యా బోధన విద్యార్థులలో విషయం పట్ల అవగాహన, ఆసక్తిని పెంపొందిస్తుందని అన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఈ బోధన ఎంతగానో ఉపయోగపడుతుందని, విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను ఏఐతో మదింపు చేయడంతో పాటు వారి పురోగతిని పరిశీలించి నివేదిక రూపొందిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా వేగాన్ని, కచ్చితత్వాన్ని, సృజనాత్మకతను పెంపొందించవచ్చని సూచించారు. సృజనాత్మకంగా ఆలోచించేవారికి ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చాలా ఉపయోగకరమని ఆయన తెలిపారు. అభ్యసనలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి అలాంటి విద్యార్థులు ఆసక్తితో స్వతహాగా నేర్చుకునే విధంగా ఈ బోధన జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థి సమస్యను గుర్తించి సామర్థ్యాల పెంపునకు ఎలా సాధన చేయాలో ఏఐ కార్యక్రమం తోడ్పడుతుందని, జిల్లాలో భూపాలపల్లి మండలంలోని గుర్రంపేట ప్రాథమిక పాఠశాల, కాటారం మండలంలోని చింతకాని ప్రాథమిక పాఠశాలలో శనివారం ఏఐతో విద్యాబోధన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామని ఇది చాలా సంతోషమని ఈ సందర్భంగా విద్యార్థులకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. ప్రాథమిక స్థాయిలో ఏఐ బోధన కార్యక్రమ కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించి విద్యార్థుల సామర్థ్యాల సాధనకు, విద్యార్థి స్థాయిని గుర్తించి అనుగుణమైన బోధనను చేపట్టడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని, దీనితో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి ఈ బోధన క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు సాధించాలని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ కాటారం మండలంలోని చింతకాని ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేదతో బోధన కార్యక్రమాన్ని ప్రారంభించి ఏఐ తో బోధన విద్యార్థులు పూర్తి అవగాహనను పెంపొందించుకునే అభ్యసన ఫలితాలు, వెనుకబడిన విద్యార్థులలో వారి అభ్యసన సామర్ధ్యాలను పెంపొందించడానికి, అర్థవంతంగా విషయ బోధన చేపట్టడానికి ఏఐ విద్యాబోధనలో ఎంతగానో సహకరిస్తుందని వివరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, ఏఐ క్వాలిటీ కో ఆర్డినేటర్ కాగిత లక్ష్మణ్, తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
పదవ తరగతి పరీక్షల ఉత్తమ ఫలితాలు సాధించాలి..
10వ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. శనివారం భూపాలపల్లి మండలం, గుర్రంపేట జడ్పిహెచ్ఎస్ పాఠశాలల్లో 10 వ తరగతి విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ప్రేరరణ కరపత్రాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుండి 10వ తరగతి పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సంతకం చేసిన ప్రేరరణ కరపత్రాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు పరిక్షలంటే బయపడొద్దని, బాగా వ్రాయాలని మనో ధైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా విద్యార్థులను సబ్జెక్టులపై ప్రశ్నలు వేసి వారి మేధోశక్తిని పరిశీలించారు. త్వరలో జరుగనున్న 10 వ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించి మన జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు. సబ్జెక్టులల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు పరిక్షలంటే బయ పడొద్దని వత్తిడిని జయించాలని అపుడే విజయం వరిస్తుందని ఆయన పేర్కొన్నారు. పరీక్షల సమయంలో ఆరోగ్య పరిరక్షణ చాలా ముఖ్యమని తగు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు. విద్య మాత్రమే మనిషిని ఉన్నతస్థాయికి చేర్చగలదని, అందరూ బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
……………………………