
ఆకేరున్యూస్, జనగామ: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను హౌస్ అరెస్టు చేశారు. ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే పత్రిపక్షాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రూ. 800 కోట్లతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రజాపాలన బహిరంగ సభలో పాల్గొంటారు.
…………………………………