
* బిల్లును ఆమోదింపజేసుకునే బాధ్యత రేవంత్ రెడ్డిదే : గంగుల
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా జయలలిత ప్రభుత్వం 69 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) తెలిపారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. బిల్లును ఆహ్వానిస్తూ సంపూర్ణ మద్దతు ప్రకటి్స్తున్నామన్నారు. పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందితేనే సంపూర్ణ సంతోషం ప్రకటించారు. చాలా రాష్ట్రాలు 50 శాతానికిపైగా రిజర్వేషన్లు ప్రతిపాదించి విఫలమయ్యాయని వెల్లడించారు. ఒక్క తమిళనాడు(Tamilanadu)లోనే 69శాతానికి పైగా రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని తెలిపారు. తమిళనాడు ఉదంతం పరిశీలించి కార్యాచారణ రూపొందించుకోవాలని సూచించారు. బిల్లును ఆమోదింపజేసుకునే బాధ్యత రేవంత్ రెడ్డి(Revanthreddy)దే అన్నారు. తమిళనాడులో కులాల ప్రాతిపదికన రెండుసార్లు సర్వే జరిగిందని పేర్కొన్నారు. తమిళనాడులో ఏడాది పాటు సర్వే చేసి నివేదిక ఇచ్చినట్లు అసెంబ్లీలో గంగుల వివరించారు. ఆ రాష్ట్రంలో బీసీ కమిషన్ ద్వారా సర్వే జరిగిందన్నారు.
……………………………….