
ఆకేరు న్యూస్ , కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం భీంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.మాజీ సర్పంచ్ జవ్వాజి కుమార్, మాజీ వార్డు మెంబర్లు తాళ్లపల్లి గణేష్, ఎలగం రవి, రహమతుల్లా, రఫీ, గుంపుల జైపాల్ దాదాపు 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన భీంపల్లి మాజీ సర్పంచి జవ్వాజీ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న పథకాలకు అకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్, టిపిసిసి సోషల్ మీడియా కార్యదర్శి వాసాల శ్రీనివాస్, గుండపు చరణ్ పటేల్, బాలసాని రమేష్ గౌడ్, పుల్లూరి శ్రీనివాసరావు, పోడేటి బిక్షపతి, కేత్తే రవి, మార్కెట్ డైరెక్టర్ ఆకినపల్లి బిక్షపతి,పైసా శరత్,తోట శంకర్,తాజుద్దీన్,కొల్లూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
…………………………