
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ- నిరుద్యోగులకు రుణాలు
* సబ్సిడీ ద్వారా రుణాలు అందచేత
* లాంఛనంగా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: రాజీవ్ యువ వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, పలువురు పార్టీ నేతలతో కలిసి ఈ పథకాన్ని సీఎం ప్రారంభించారు. కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే 54 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. తొలి ఏడాదిలోనే ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం మరొకటి లేదన్నారు. రాష్ట్రంలో 50లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 43 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు. త్వరలోనే స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 65 లక్షల మంది మహిళలకు 1.20 కోట్ల నాణ్యమైన చీరలు పంపిణీ చేయనున్నట్లు సీఎం వెల్లడిరచారు. రాష్ట్రంలోని ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లలో ఇప్పటివరకూ కులగణన జరగలేదు. సమాజానికి ఎక్స్ రే వంటి కులగణన దేశమంతా జరగాలని రాహుల్ గాంధీ చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశపెట్టాం. ఎస్సీల వర్గీకరణ కోసం 35 ఏళ్లుగా ఉద్యమం సాగుతోంది. దశాబ్దాలుగా నానుతున్న ఎస్సీ వర్గీకరణపై కూడా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాం. అబద్ధాల పునాదుల విూద మేము ప్రభుత్వాన్ని నడపలేమని.. గత ప్రభుత్వం భారీగా అవినీతి, దుబారాకు పాల్పడిరదన్నారు. దుబారా ఖర్చులను తగ్గించుకుంటూ అప్పులు చెల్లిస్తున్నామని.. ఒక్క ఇసుక విక్రయంలోనే రోజువారీ ఆదాయం రూ.3 కోట్లు పెరిగిందని వివరించారు. రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లలో 17 శాతం పెరుగుదల నమోదైందని.. ధరల పెరుగుదలను నియంత్రించడంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా ఉందని సిఎం అన్నారు. నాకు పరిపాలనపై పట్టు రాలేదని కొందరు అంటున్నారు. మంత్రివర్గం నుంచి మంత్రులను తొలగిస్తేనే.. పట్టు ఉన్నట్లా? అధికారులను తొలగించి, బదిలీలు చేస్తేనే పాలనపై పట్టు- సాధించినట్లు అవుతుందా?ఎలాంటి ఆరోపణలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వ పథకాల్లో పారదర్శకంగా వ్యవహరించాలని మా ఎమ్మెల్యేలకు.. అసలైన అర్హులకు పథకాలు తప్పకుండా వర్తింపజేయాలని అధికారులకు చెబుతున్నాను. అన్నింటినీ సవ్యంగా సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లడమే నా విధానమని.. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం కలిగించడమే మా లక్ష్యం అని సీఎం అన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూనే స్వయం ఉపాధి కల్పించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని.. యువ వికాసం పథకాన్ని ఉపయోగించుకొని యువత ఉపాధి కల్పించుకోవాలని తెలిపారు. ఉద్యోగాలు లభించక గ్రావిూణ యువత ఇబ్బందులు ఎదుర్కొంటోందని.. యువ వికాసం పథకాన్ని గ్రావిూణ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.. ఏడాది వ్యవధిలోనే గ్రూప్-1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా ఇచ్చామని.. రాష్ట్రంలో ఒకప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ధర్నాలు జరిగేవని.. ఇప్పుడు నోటిఫికేషన్ల మధ్య కొంత గ్యాప్ ఇవ్వాలని ధర్నాలు జరిగే రోజులొచ్చాయని వివరించారు. యువతకు ప్రభుత్వ, ప్రైవేటు- ఉద్యోగాల కల్పనతో పాటు- స్వయం ఉపాధిపైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని భట్టి అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ- నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయం చేయనుందని.. యువ వికాసానికి ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 6 నుంచి మే 30 వరకు లబ్ధిదారుల ఎంపిక, యూనిట్ల కేటాయింపు పక్రియ ఉంటుందని తెలియజేశారు. ఎన్నికల వేళ ఇచ్చిన హావిూల్లో ఒక్కో హావిూని నెరవేరుస్తూ వస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆరు హావిూల్లో భాగంగా ఇప్పటికే కొన్ని పథకాలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల విూదుగా మరో పథకాన్ని ప్రారంభించారు. సోమవారం తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్కీమ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత కోసమే ఈ పథకం..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత కోసం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా 5 లక్షల మందికి రూ. 6 వేల కోట్ల రాయితీ రుణాలు మంజూరు చేయనున్నారు. ఒక్కో లబ్దిదారుడికి రూ. 4 లక్షల వరకు రుణం మంజూరు చేయనున్నారు. 60 నుంచి 80 శాతం వరకు రాయితీతో ఈ రుణాలు మంజూరు చేయనున్నారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. జూన్ 2వ తేదీన రాయితీ రుణాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రుణాలు మంజూరు చేయనుంది ప్రభుత్వం. 5 లక్షల మంది యువతకు రూ 6 వేల కోట్లు- ఇవ్వనుంది ప్రభుత్వం. రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తే.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటు-న 4,200 మందికి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
…………………………………………..