
* 286 రోజుల తర్వాత రిటర్న్ జర్నీ
ఆకేరున్యూస్ : భారతీయ సంతతి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ మరికొన్ని గంటల్లో నేలపై దిగనున్నది. 286 రోజుల పాటు అంతరిక్షంలో ఉన్న ఆ వ్యోమగామితో పాటు విల్మోర్ కూడా ఇవాళ అంతరిక్ష కేంద్రం నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు.. జూన్ 5, 2024లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా వాళ్లు ఆ ప్రయాణం చేపట్టారు. కానీ టెక్నికల్ సమస్య రావడంతో.. 8 రోజుల కోసం వెళ్లిన ఆ జంట.. 9 నెలల పాటు అక్కడే చిక్కుకుంది. అంతరిక్ష కేంద్రం నుంచి డ్రాగన్ క్యాప్సూల్ కొన్ని క్షణాల క్రితం అన్‌డాకింగ్ అయ్యింది. 17 గంటల జర్నీ తర్వాత భూమిపై ఆ క్యాప్సూల్ వాలనుంది.
https://x.com/NASA/status/1901863560352879032?
………………………