
ఆకేరున్యూస్, ఢిల్లీ: పొరుగు దేశాలతో పోలిస్తే భారత్లోనే రైలుచార్జీలు చాలా తక్కువగా ఉన్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభకు తెలియజేశారు. 350 కిలోమీటర్ల ప్రయాణాన్ని పరిశీలిస్తే భారతదేశంలో జనరల్ క్లాస్ చార్జీ రూ.121గా ఉంది. కానీ పాకిస్తాన్లో రూ. 400, శ్రీలంకలో రూ.413. దాదాపు అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది అని తెలిపారు. 2020 నుంచి రైలు చార్జీలు ఏ మాత్రం మారలేదన్నారు. ఇంధన ధరలు పెరిగినప్పటికీ చార్జీలు పెంచలేదన్నారు.
……………………