* జన్వాడ కేసును కొట్టేసిన హైకోర్టు
* మరో కేసులో కేటీఆర్ కు కూడా ఊరట
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును హైకోర్టు (High Court) కొట్టేసింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో 2020 మార్చిలో నమోదైన కేసును కొట్టేసింది. జన్వాడ(Janwada)లో డ్రోన్ ఎగురవేశారని నాడు రేవంత్ రెడ్డి సహా పలువురిపై కేసు నమోదైంది. ఈకేసులో రేవంత్ రెడ్డిని నార్సింగ్ పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈ కేసుకు చెందిన ఎఫ్ ఐఆర్ క్వాష్ చేయాలని 2020 మార్చిలోనే రేవంత్ రెడ్డి పిటిషన్ వేశారు. జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని రేవంత్ తరఫున న్యాయవాది కోర్టులో వాదించారు. ఆయనపై తప్పుడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని, డ్రోన్ ఎగురవేసిన ప్రాంతం నిషద్ధ జోన్లో లేదని పీపీ తెలిపారు. పీపీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు నార్సింగ్(Narsing) పీఎస్ పరిధిలో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేసింది.
కేటీఆర్‌పై నమోదైన కేసును సైతం..
కేటీఆర్‌పై నమోదైన కేసును కూడా హైకోర్టు కొట్టేసింది. సైఫాబాద్ పీఎస్ పరిధిలో నమోదైన కేసును కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేవంత్ రెడ్డిని కించపరిచేలా మాట్లాడారని ఆయనపై ఎంపీ అనిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసును కొట్టేయాలని కేటీఆర్ (Ktr) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాధ్యత గల హోదాలో ఉన్న కేటీఆర్ ఇష్టారీతిన సీఎంను కించపరిచేలా మాట్లాడారని పీపీ వాదనలు వినిపించారు. రాజకీయ కక్షతోనే కేటీఆర్‌పై కేసు నమోదు చేశారని, ఆయన తరఫున న్యాయవాది వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు కేసు ను కొట్టేసింది.
………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
