Parvatham Srinivasa Rao Felicitation
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
రిటైర్డ్ డిసిఓ పార్వతం శ్రీనివాస రావుని స్వేరోస్ ఇంటర్నేషనల్ యాదాద్రి జోన్ సోమవారం ఘనంగా సత్కరించారు. స్టేషన్ ఘన్ పూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలకి 2000 సంవత్సరంలో లెక్చరర్ (అధ్యాపకులు)గా వచ్చి, విద్య బోధనలు చేసి, అంచలంచలుగా ఎదిగి, ప్రిన్సిపల్ గా ఎన్నో సంవత్సరాలు పనిచేసి, చివరగా జనగామ జిల్లాలో ప్రిన్సిపాల్, డిసిఓ (DCO)గా బాధ్యతలు స్వీకరించిన పార్వతం శ్రీనివాస రావు పదవి విరమణ పొందారు.
ఈ సందర్భంగా స్వేరోస్ ఇంటర్నేషనల్ యాదాద్రి జోన్ తరపున శ్రీనివాసరావుకి శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో స్వేరోస్ ఇంటర్నేషనల్ సభ్యులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
