* నెగిటివ్ పాలిటిక్స్ వల్ల ఆదాయం తగ్గిపోయింది
* అంకెలు ఎందుకు ఆగమాయ్యాయో చెప్పు
* బడ్జెట్‌పై ఘాటు విమర్శలు చేసిన కెటిఆర్
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఒక్క మాటలో ఈ బడ్జెట్ గురించి చెప్పాలంటే.. ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్‌లా ఉందని అంటూ కెటిఆర్ విమర్శలు గుప్పించారు. నీ తెలివి తక్కువ తనం వల్ల, నెగిటివ్ పాలిటిక్స్ వల్ల ఆదాయం తగ్గిపోయిందని సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి నేరుగా విమర్శలు చేశారు.విూడియా ముందు రంకెలు వేయడం కాదు.. అంకెలు ఎందుకు ఆగమాయ్యాయో చెప్పు. గత బడ్జెట్ సందర్భంగా చెప్పినట్లు విూ బడ్జెట్ అంచనాలకు ఎందుకు చేరుకోలేకపోయింది. నమ్మి ఓట్లేసిన పాపానికి 4 కోట్ల మందిని ముంచిన బడ్జెట్ ఇది అంటూ విమర్శలు చేశారు.. పదేండ్ల ప్రగతి రథచక్రానికి పంక్చర్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డి అసమర్థతకు, చేతగానితనానికి నిలువుటద్దం ఈ బడ్జెట్. వీరి అసమర్థతత, చేతకాని తనం వల్ల ఆకాశం నుంచి పాతాళం వైపు ఆర్థిక వ్యవస్థ పోతున్నదంటే కచ్చితంగా బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. కేసీఆర్ ఏడాదికి రూ. 40 వేల కోట్ల అప్పు జేస్తే రంకెలు వేశారు. కానీ ఇవాళ ఒక్క ఏడాదికి లక్షా 60 వేల కోట్లు- అప్పు చేసి కొత్త ప్రాజెక్టు కట్టలేదు. ఒక్క ఇటు-క పేర్చలేదు. ఒక్క గ్యారెంటీ- కూడా పూర్తిగా అమలుకు నోచుకోలేదు. ఈ బడ్జెట్‌ను చూస్తుంటే లక్షల కోట్ల అప్పు టార్గెట్ కనబడుతున్నట్టు- ఉందని కేటీ-ఆర్ పేర్కొన్నారు. తొండ ముదిరితే ఊరసవెల్లి అవుతదని పెద్దలు చెబుతారు. కానీ ఊరసవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అయితడని ఈబడ్జెట్ చూసిన తర్వాత అర్థమవుతుంది. సంక్షేమానికి సమాధి.. అభివృద్ధికి అడ్రస్ గల్లంతు.. ప్రజలకు ఇచ్చిన హావిూలకు ఘోరీ కట్టి.. పార్టీ కార్యకర్తలకు మాత్రం వీళ్ల అబ్బ సొత్తు.. పప్పుబెల్లం లాగా 6 వేల కోట్లు- పంచి పెడుతారట. కార్యకర్తలకు ఇస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. పప్పుబెల్లంలాగా పంచి పెడుతామంటే.. అది యువ వికాసం కాదు కాంగ్రెస్ వికాసం అయితది అని కేటీఆర్ మండిపడ్డారు.తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షడు కెటిఆర్ విమర్శలు గుప్పించారు. బడ్జెట్లో తెలంగాణ ఆడబిడ్డకు తీరని అన్యాయం చేశారని ఆయన అన్నారు. అసెంబ్లీ విూడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ-లు గోవిందా అని అర్ధమైందని పేర్కొన్నారు. ఏడాది దాటిన ఉద్యోగాల ఊసే లేదని.. బిఆర్ఎస్ హయాంలో వచ్చిన నోటిఫికేషన్లు తామే ఇచ్చినట్లు- కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల్లో హావిూ ఇచ్చిన తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2వేలు, రూ.4వేలు పెన్షన్లు ఇస్తామన్న పాతరేశారని మండిపడ్డారు. కులగణన సర్వే పేరుతో వెనుకబడిన వర్గాలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ ఎజెండా నెరవేర్చాల్సిన సమయం 40 శాతం గడిచిపోయిందని గుర్తు చేశారు. ప్రభుత్వం అందమే సక్కగా లేదు కానీ.. అందాల పోటీ-లు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. రంకెలు కాదు రేవంత్ రెడ్డి.. అంకెలు ఎక్కడ పోయినాయి అని ప్రశ్నించారు. ఆకాశం నుంచి బడ్జెట్ పాతాళానికి పడిపోతుందని.. పాలన చేతకాని ప్రభుత్వం.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.
…………………………………………
