ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బెట్టింగ్ యాప్(Betting App)లపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు వాటిని ప్రమోట్ చేస్తున్న, చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు యూట్యూబర్లు, బుల్లితెర నటులపై కేసులు నమోదు చేశారు. యూట్యూబర్ వర్షిణి సహా 25 మందిపై కేసు నమోదు చేశారు. తాజాగా ప్రముఖల నటులపై కూడా కేసులు నమోదయ్యాయి. దగ్గుబాటి రానా(Rana), విజయ్ దేవరకొండ(Vijay devarakonda), ప్రకాశ్‌రాజ్(Prakashraj) పై తదితరులపై కేసు నమోదు చేశారు. అలాగే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన సెలబ్రెటీల పై మియాపూర్ పోలీసుకు కేసు నమోదు చేశారు. మంచు లక్ష్మీ(Manchu Laxmi), నిధి అగర్వాల్ సహా 25 మంది పై కేసు నమోదు చేశారు పోలీసులు. వీరిలో రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ పేర్లు కూడా ఉన్నాయి. వీరితోపాటు.. శోభాశెట్టి, అమృత చౌదరి, నాయని పావని, పండు, నేహా పఠాన్, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి, బయ్యా సన్నీయాదవ్, శ్యామల, విష్ణుప్రియ, టేస్టీ తేజ, రీతూ చౌదరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా ఈ కేసు విచారణ నిమిత్తం ఈరోజు విష్ణుప్రియ సహా కొందరు యూట్యూబర్లు పంజాగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు.
………………………………….
