
చంద్రబాబు నాయుడు- పవన్ కళ్యాణ్
ఆకేరున్యూస్, అమరావతి :
తెలుగుదేశం-జనసేన-బీజేపీ నేతలు చంద్రబాబు నివాసంలో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీని ఢీకొట్టేందుకు జట్టు కట్టిన వీరు సీట్ల పంపకం, అభ్యర్థుల ప్రకటన అనంతరం.. అభ్యర్థులు, పార్టీ కార్యకర్తల మధ్య నెలకొన్న విభేదాలు, కొన్నిచోట్ల బహిర్గతం అవుతున్న అంతర్గత ఘర్షణలపై దృష్టి సారించేందుకు వీరు చంద్రబాబు నివాసంలో కలిసినట్లు తెలిసింది. ఈ భేటీలో బీజేపీ నేతలు పురందేశ్వరి, సిద్దార్థ నాథ్ సింగ్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఉన్నారు. మూడు పార్టీల నేతల మధ్య సమన్వయం, ప్రచారంపై చర్చించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
—————————