
* నేడే అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్‌రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో నేడు తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. డీలిమిటేషన్‌పై వివిధ రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు తెలపనున్నాయి. బీజేపీ మినహా మిగిలిన పక్షాలన్నీ డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు పెరిగే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతుండగా.. ఆయా ప్రాంతాల్లో సీట్లు పెంచుకుని మళ్లీ అధికారంలోకి రావాలని కమలం పార్టీ ప్రయత్నిస్తుందని వివిధ రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. కాగా.. డీలిమిటేషన్ తీర్మానంపై చర్చ ఉన్న నేపథ్యంలో నేడు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. తీర్మానం తర్వాత పద్దులపై తమ అభిప్రాయాలు చేయనున్నారు. దీంతో పాటు పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల సవరణ చేయనున్నారు. కొత్తగా ఆరు మున్సిపాలిటీలను, కొత్తగూడెం కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయనున్నారు. కొన్ని గ్రామ పంచాయతీల సరిహద్దులు, పేర్లను సైతం మార్చనున్నారు.
………………….