
* సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University)లో 400 ఎకరాల ప్రభుత్వ భూమి వేలాన్ని నిలిపివేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishanreddy)అన్నారు. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఆ భూమికి ఆనుకుని వైవిధ్య భరితమైన జీవ జాతులు ఉన్నాయని తెలిపారు. ఆ ప్రాంతంలో అనేక జంతు, వృక్ష జాతులు ఉన్నాయన్నారు. వనరుల పేరిట పర్యావరణాన్ని నాశనం చేయడం మంచిది కాదని హితువు పలికారు. నగరాన్ని జీవ వైవిధ్యంతో కూడిన ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్లా మార్చవద్దని కిషన్ రెడ్డి కోరారు. గతంలో ప్రభుత్వ భూముల విక్రయాన్ని రేవంత్ రెడ్డి (Revanthreddy) వ్యతిరేకించిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కాగా, యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి. ఇదే క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ నిర్ణయం విద్యార్థులకు, పర్యావరణ ప్రేమికులకు ఆమోదయోగ్యం కాదన్నారు.
………………………………………