
* ఓ ఈవెంట్లో హీరోయిన్‌పై అసభ్యకర కామెంట్
ఆకేరున్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎప్పుడు ఏదోఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఓ సినిమా ఆడియో ఫంక్షన్‌కు వెళ్లిన మల్లారెడ్డి హీరోయిన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ పేరు కసీ కపూర్ అంట.. ఆమె మాత్రం కసికసిగా ఉందంటూ నోరు పారేసుకున్నారు. మల్లారెడ్డి వ్యాఖ్యలతో ఈవెంట్‌కి వచ్చిన ప్రేక్షకులంతా పగలపడి మరీ నవ్వారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. మల్లారెడ్డి వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగానూ పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. చట్టసభల్లో ఉండే వ్యక్తులు మహిళల గురించి ఇలా మాట్లాడడం ఏంటని పలువురు మండిపడుతున్నారు. సినిమా ఆడియో ఫంక్షన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే మల్లారెడ్డిని నిర్వాహకులు స్టేజ్ పైకి ఆహ్వానించగానే సంచలన వ్యాఖ్యలు చేశారు.
……………………………….