
* ఏప్రిల్ 12 వరకు నిత్య కల్యాణాలు నిలిపివేత
ఆకేరు న్యూస్, భద్రాచలం : భద్రాచలం(Bhadrachalam)లో శ్రీరామ నవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నిన్న ఉగాది సందర్భంగా వేడుకలకు అంకురార్పణ చేసిన పండితులు ఈ నెల 12వరకు రామాలయంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు (Sri Rama Brahmotsavams) నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాల అంకురార్పణ సందర్భంగా పుట్టమట్టిని పూజించారు. ఏప్రిల్ 5న సీతారాముల ఎదుర్కోలు ఉంటుందని, 6న కల్యాణ మహోత్సవం, 7న మహా పట్టాభిషేకం వేడుక ఉంటాయన్నారు. ఉత్సవాల దృష్ట్యా ఏప్రిల్ 12 వరకు నిత్య కల్యాణాలు నిలిపివేయనున్నట్లు ప్రకటించారు.
…………………………………..