* మంత్రి శ్రీధర్‌బాబును కోరిన ఈటల రాజేందర్
ఆకేరున్యూస్, హైదరాబాద్: మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని మంత్రి శ్రీధర్‌బాబును ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును ఈటల రాజేందర్ కలిసి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో తాగునీటి సరఫరా, రోడ్లు సరిగా లేవని, చెరువులు మురికి కూపాలుగా మారాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే హైడ్రా పేరిట డబ్బులు వసూలు చేస్తున్న బ్లాక్‌మెయిలర్లపై దృష్టి సారించాలని కోరారు. చిన్న దేవాలయాలను కూడా దేవదాయశాఖ పరిధిలోకి తీసుకురావడంతో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారంపై మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారని ఈటల రాజేందర్ తెలిపారు.
……………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
