
* ఎక్కడా లేని ప్రేమ చూపుతున్నట్లు నటించింది..
* రజిత భర్త మనోవేదన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వివాహేతర సంబంధానికి అడ్డు వస్తారని కన్న పిల్లలను కడతేర్చిన తల్లి ఘటన ఇంకా అందరికీ గుర్తుండే ఉంటుంది. నిందితురాలు రజిత(Rajitha), ఆమె ప్రియుడు శివ (Siva) ప్రస్తుతం జైల్లో ఉన్నారు. రజితకు సంబంధించి ఆమె భర్త చెన్నయ్య సంచలన విషయాలు వెల్లడించారు. వాడితో లేచిపోయినా.. తాను పిల్లలను బంగారంలా చూసుకునేవాడిని, ప్రపంచంలో ఏ తల్లీ చేయని పని చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలలుగా తనపై ఎక్కడాలేని ప్రేమ చూపించినట్లు రజిత నమ్మించి చివరకు తన గొంతు కోసిందన్నారు. రజిత భర్త మనోవేదన చర్చనీయాంశంగా మారింది. పిల్లల్ని చంపినందుకు కనీసం తన భార్యకు పశ్చాత్తాపం కూడా లేదని, ఆసుపత్రిలో కన్నీళ్లు కూడా పెట్టుకోలేదన్నారు. ఇలాంటి తల్లి ఎవరికి ఉండకూడదన్నారు. తన భార్య రజిత, శివను ఎన్కౌంటర్ను చేస్తేనే తన పిల్లల ఆత్మకు శాంతి చేకూరుతుందని చెన్నయ్య తెలిపారు. చెన్నయ్యను రెండో పెళ్లి చేసుకున్న రజిత.. భర్తతో ఏజ్ గ్యాప్ ఉండటం, ప్రియుడి మోజులోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆరు నెలల క్రితం జరిగిన గెట్ టు గెదర్ (Get together) క్లాస్ మేట్తో ప్రేమాయణం సాగించిన రజిత అతడిని వివాహం చేసుకునేందుకు పిల్లలను అడ్డు తొలగించుకోవాలని భావించింది. ప్రియుడితో సుఖంగా ఉండాలని రజిత స్కె్చ్ వేసి.. పెరుగులో విషం కలిపి చంపేసింది.
……………………………..