
* 25 ఏళ్ల గులాబీ పండుగను విజయవంతం చేద్దాం..
* మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఆకేరున్యూస్, వరంగల్: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలివెళ్లి 25 ఏళ్ల గులాబీ పండుగను విజయవంతం చేద్దామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం వర్ధన్నపేట మండల కేంద్రంలో వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని 01, 02వ డివిజన్ ముఖ్య కార్యకర్తలతో ఎర్రబెల్లి నివాసంలోనీ పార్టీ ఆఫీస్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు. ఈ సభను ఒక పండగ వాతావరణం తలపించేలా చేయాలని.. మన పార్టీ బలోపేతం కోసం మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని.. నాడు కెసిఆర్ చేసిన పనులే మనకు శ్రీరామరక్ష అన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు. రైతును రాజు చేసింది కేసీఆర్ అయితే.. ఆ రైతు వెన్నెముక విరిసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. నాకు తెలిసి ఇద్దరే గొప్ప విజన్ ఉన్న నాయకులు ఉన్నారని.. నాడు ఎన్టీఆర్ ప్రజల సమక్షేమం కోసం పథకాలు పెడితే.. వాటి కొనసాగింపుగా రైతుల కోసం సాగునీరు కరెంట్ కోతలు లేకుండా రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు భీమా పెట్టిన గొప్ప విజన్ ఉన్న నాయకులు కేసీఆర్ అన్నారు. ఫింఛన్లు పెట్టింది ఎన్టీఆర్ అయితే దాన్ని పెంచి ఆసరా అయింది కేసీఆర్ అని పేర్కిన్నారు. కేసీఆర్ ముందుచూపుతో తండాలను గ్రామపంచాయతీలుగా చేస్తే ఈ ప్రభుత్వం కనీసం ఆ గ్రామపంచాయతీ బిల్లులు చెల్లించడానికి కూడా ముందుకు రావడం లేదని విమర్శించారు. ప్రజలకు మోసపోయి కాంగ్రెస్కు ఓటేసారని వారికి అర్థమైందని.. ప్రజలను చైతన్యవంతం చేసి రైతులకు జరుగుతున్న నష్టానికి మనం అండగా నిలిచి ప్రతి ఒక్కరిని ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నుంచి రక్షించాల్సిన అవసరం మనందరికీ ఉందన్నారు. రానున్న స్థానిక ఎలక్షన్లో మన సత్తా చాటల్సిన బాధ్యత ఉందని.. రానున్నది మన ప్రభుత్వమే.. కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసే దిశగా మనందరం కష్టపడాల్సిన బాధ్యత ఉందన్నారు.
……………………………………………