
* అంబేడ్కర్ జయంతి సందర్భంగా జీవో జారీ
* వెల్లడిరచిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ప్రకటించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ తుది సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. చట్టం విధివిధానాలను వివరించే జీవోను రేపు జారీ చేస్తామని తెలిపారు. సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు దామోదర్ రాజ నరసింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, వన్-మ్యాన్ కమిషన్కు నాయకత్వం వహించిన రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్, సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, లా సెక్రటరీ తిరుపతి ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా అమలు మార్గ దర్శకాలను కమిటీ క్షుణ్ణంగా సమీక్షించి, జీవో జారీ చేయడానికి తుది ఆమోదం తెలిపింది.
……………………………………