* 10 ఏండ్లల్లో కేసీఆర్ బ్రహ్మాండమైన పాలన అందించారు
* 27న జరగబోయే సభ చరిత్రలో నిలుస్తుంది.
* మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్
ఆకేరున్యూస్, ఎల్కతుర్తి: ఆధికారంలోకి వచ్చిన 15 నెలల్లో పాలనాపరంగా అభాసుపాలైన ఏకైక ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వమని మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజతోత్సవ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్
కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న సభావేదికను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎన్నో ఉచిత హామీలతో అమల్లోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. బహుషా ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా ప్రజల చేత ఛీ కొట్టించుకున్న సందర్భాలు లేవని చెప్పారు. కాంగ్రెస్ కూడా ఇంత ప్రజా వ్యతిరేకత వస్తదని ఊహించి ఉండకపోవచ్చన్నారు. బీఆర్ఎ ఎస్ అధినేత కేసీఆర్ గత 10 ఏండ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధితో బ్రహ్మాండమైన పరిపాలన అందించారని పేర్కొన్నారు. ఆనాడు ఉద్యమ సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ పోరాడన్నారు. నాడు తెలంగాణ సాధిస్తామని చెప్పి సాధించిన ఏకైక పార్టీ గులాబా జెండా అన్నారు. తెలంగాణ వెనకబడి ఉన్న ప్రాంతమన్న అభిప్రాయం ఉండేదని, కానీ పాలక పగ్గాలు చేపట్టిన కేసీఆర్ అభివృద్ధి చేసుకోవచ్చని చేసి రుజువు చేశారని కొనియాడారు. దురదృష్టవశాత్తు పార్టీలు గెలుస్తాయి. ఓడుతాయని, కానీ ప్రజలకు మంచి చేస్తేనే ఎవరినైనా గుర్తు పెట్టుపెట్టుకుంటారని వివరించారు. ఈ ప్రాంత అభివృద్ధి, సంక్షేమంపై కేసీఆర్‌కు ఉన్న తపన మరే నాయకునికి, పార్టీకి ఉండదని స్పష్టం చేశారు. 25 ఏండ్లు నిండిన పార్టీగా బీఆర్ఎస్ నేడు రజతోత్సవ వేడుకలకు సిద్ధమైందని, 27న జరగబోయే బహిరంగ సభకు ప్రజల నుంచి స్పందన చాలా బాగుందన్నారు. స్వచ్ఛందంగా సభకు తరలివచ్చేందుకు ప్రజలు ఉత్సాహం. చూపుతున్నట్లు తెలిపారు. అలాగే ఎల్కతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావస్తున్నాయని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ చెప్పారు. సభా వేదికను కేసీఆర్ సూచనల మేరకు 500 మంది ప్రతినిధులు కూర్చునేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సభా ప్రాంగణం, పార్కింగ్ కోసం ఇప్పటికే 1200 ఎకరాలు సేకరించాం. వరంగల్ సిద్ధిపేట- కరీంనగర్ల నుంచి వచ్చే వాహనాలకు ఆయా రూట్లలో పార్కింగ్ స్థలాలను గుర్తించాం. ఆయా ప్రాంతాల నాయకులు వచ్చి ముందుగానే పార్కింగ్ స్థలాలను చూసుకుని వెళ్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు సైతం చర్యలు తీసుకుంటున్నట్లు సతీష్‌కుమార్ తెలిపారు.
……………………………………………….
