
* వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు కూటమి నేతల ఫోన్
ఆకేరు న్యూస్, తిరుపతి : తిరుపతి (TIRUPATHI) ఎస్వీ గోశాల వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే భూమల కరుణాకర్ రెడ్డి(KARUNAKAR REDDY)కి ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్(BOJJALA SUDHIR), పులవర్తి నాని, మురళి, నవాజ్ భాషా ఫోన్ చేశారు. ఎస్వీ గోశాలను సందర్శించాలని కరుణాకర్ రెడ్డికి సూచించారు. అసత్య ఆరోపణలు కాదని, క్షేత్రస్థాయిలో పరిశీలనకు రావాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు. పోలీసుల సూచన మేరకు ఐదుగురితో గోశాలకు రావాలని అన్నారు. ఎమ్మెల్యేల పిలుపునకు కరుణాకర్‌రెడ్డి స్పందించారు. గోశాలకు వస్తానని తెలిపారు. దీంతో తిరుపతి గోశాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
………………………………………