* అధికారులే పవర్ ఫుల్
* నేతలు కామన్ పీపుల్
ఆకేరు న్యూస్, ఖమ్మం : ఎన్నికల వేళ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు అధికార పటాటోపానికి దూరంగా ఉండాల్సిందే.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ( Code of conduct) పాటించాల్సిందే.. ఎన్నికలకు ముందు సాధారణ నేతలుగా ఉండే వారు.. అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులుగా ఇతర హోదాల్లో సర్వ శక్తివంతులుగా మారిపోతారు. అధికారులు వినయ , విధేయతలను చూపిస్తూ ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఎలాంటి కొరత లేకుండా చూసుకుంటారు. ఎన్నికల ప్రకటన రావడంతో సీన్ రివర్స్ అవుతుంది. అధికారులు సర్వ శక్తివంతులుగా మారిపోతారు. నేతలు కామన్ పీపుల్ గానే పరిగణించ బడతారు. అధికార ప్రోటోకాల్స్, ప్రత్యేక ఆహ్వానాలు, ప్రత్యేక వసతి.. ఇలా ప్రత్యేక… ప్రత్యేకతలు తాత్కాళికంగా హరించబడతాయి. ఎన్నికల వేళ అధికార పార్టీ . అధికారం లేని పార్టీల నేతలు కూడా సర్వసమానులగానే ఉండాలన్నదే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అసలు ఉద్దేశం.. ఇక అసలు వషయానికి వస్తే.. భద్రాద్రి శ్రీరామనవమి సందర్భంగా ఈ దృశ్యం ఆవిష్కరించబడింది.
* పట్టు వస్త్రాలు సమర్పించిన శాంతికుమారి.
నిబంధనల ఉల్లంఘనపై ఈసీ సీరియస్గా స్పందిస్తుండటంతో ముందూ వెనుకా చూసుకొని అధికార పార్టీ నేతలు మరీ అడుగులు వేస్తున్నారు. భద్రాచలం ( Badradri )లో సీతారాముల కల్యాణం వేళ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్తో సీఎం రేవంతరెడ్డి ఈసారి దూరంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆనవాయితీగా సమర్పించే పట్టు వస్త్రాలు , ముత్యాల తలంబ్రాలను చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి సమర్పించారు.
ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సాదాసీదాగా వచ్చి కల్యాణోత్సవాన్ని సామాన్య భక్తుల్లా తిలకించారు. కోడ్ లేదంటే వీరికి అధికార హోదాతో ఆవిష్కరించేవారు. ఉన్నత హోదాలో ఉన్నప్పటికీ కోడ్ పుణ్యమా అని సాధారణ భక్తులుగానే మారిపోయారు. సహజంగానే అధికారం వచ్చినప్పటికీ అందుకు సంబందించిన హోదా తాత్కాళికంగా నైనా తమకు దూరం కావడం మానసికంగా ఇబ్బందికర పరిస్థితే కదా..! కోడ్ లేకున్నప్పటికీ బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ కేవలం రెండుసార్లే తలంబ్రాలు సమర్పించగా, కొన్నిసార్లు మంత్రులు, ఓసారి గవర్నర్ నరసింహన్ సమర్పించారు. ఇక ఒక సారి కేసీఆర్ మనవడు హిమాన్షు సమర్పించడం వివాదానికి దారితీసింది. భద్రాచల కల్యాణోత్సవ చరిత్రలో చీఫ్ సెక్రెటరీ తలంబ్రాలు సమర్పించడం ఇదే ప్రథమం అంటున్నారు. కోడ్ ఇలా శాంతికుమారికి కలిసివచ్చిందన్నమాట. కోడ్ రూల్స్ రాజకీయ నేతలకు సంకటంగా, అధికార యంత్రాంగానికి అద్భుత అవకాశంగా భద్రాద్రి మారింది.
ఈసీయా.. మజాకా..! అక్కడికి వచ్చిన భక్తులు చర్చించుకుంటున్నారు..
————————–