
ఆకేరున్యూస్, హన్మకొండ: ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా, పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక, జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం హన్మకొండ జిల్లాలోని దేవునూరు ఇనుపరాతి గట్టు అడవిలో నడక కొనసాగించిన అనంతరం దేవునూరు జడ్పీహెచ్ఎస్లోని విద్యార్థులకు చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు పెట్టి బహుమతులు అందజేశారు. అలాగే ప్రధానోపాధ్యాయులు కరపత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కె.పురుషోత్తం ,టి.శ్రవణ్ కుమార్, వి.శ్రీనివాస్, టి.ప్రశాంత్, యస్.కమలాకర స్వామి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అటవీశాఖ అధికారి పాల్గొన్నారు.
………………………………………….