
* అతి త్వరలో ప్రతీకారం తీర్చుకుంటాం
* ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో బదులిస్తాం
* రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్
ఆకేరు న్యూస్, డెస్క్ : అతిత్వరలో ప్రతీకారం తీర్చుకుంటాం, ఉగ్రదాడులు వెనుక ఎవరు ఉన్నా వదిలి పెట్టేది లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) హెచ్చరించారు. ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో బదులు ఇస్తామని ప్రకటించారు. జమ్ము కశ్మీర్(Jammu kashmir)లో దాడుల నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతులతో సమావేశమైన ఆయన ఢిల్లీలో్ మాట్లాడారు. పహల్గామ్ దాడులు వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టబోమన్నారు. భారత్‌ను ఎవరూ భయపెట్టలేరని తెలిపారు. ఒక్క దోషిని కూడా విడిచిపెట్టబోమని మరోసారి స్పష్టం చేశారు. దాడి చేసిన వారినే కాకుండా, వారి వెనుక ఎవరు ఉన్నా క్షమించేది లేదన్నారు. భారత్ ప్రతిచర్య ఎలా ఉంటుందో ప్రపంచం చూస్తుందన్నారు. కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ నేపథ్యంలో రాజ్ నాథ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పహల్గామ్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి బయలుదేరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amithsha).. కేబినెట్ భేటీలో పాల్గొననున్నారు.
……………………………………….