
ఆకేరున్యూస్, వరంగల్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేకపూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కవిత మాట్లాడుతూ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని.. అలాగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కుంభమేళాను తలపించేలా జరగనుండగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా నేతలతో కలిసి సభా ప్రాంగనాన్ని పరిశీలించడానికి వచ్చామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితతో పాటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్, పలువురు బీఆర్ఎస్ నేతలు అమ్మవారిని దర్శించుకున్నారు.
…………………………………….