
ఆకేరున్యూస్, తిరుమల: టాలీవుడ్ ప్రముఖ నటి మీనాక్షి చౌదరి తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొనగా.. ఆలయానికి చేరుకున్న నటికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి శేషవస్త్రంతో సత్కరించారు. అలాగే స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల నటిని చూసిన భక్తులు ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు.
……………………………………………