
ఆకేరు న్యూస్, డెస్క్ : పాక్ నటుడి సినిమాపై భారత్ లో నిషేధం విధించారు. అభీర్ గులాల్ (Abir Gulaal) చిత్రంపై కేంద్రం నిషేధం విధించింది. ఈ చిత్రంలో ఫవార్ ఖాన్ నటించారు. ఇది భారతీయ హిందీ భాషా రొమాంటిక్ కామెడీ చిత్రం. దీనిని వివేక్ బి. అగర్వాల్ నిర్మించారు. ఆర్తి ఎస్. బాగ్డి దర్శకత్వం వహించారు. ఇందులో వాణి కపూర్ సరసన పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్ (Pawad Khan) ‘అబీర్ గులాల్’తో బాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతుండగా, కేంద్రం తాజాగా ఇటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా మే 9, 2025న విడుదల కావాల్సి ఉంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్లో విడుదల కావడం ఇక కష్టమే. ఈ ప్రాజెక్ట్ పట్ల ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా మారింది. సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో ఆ సినిమాను భారత్ లో నిషేధించాలని కేంద్రం నిర్ణయించింది.
…………………………………………………