
* పాకిస్థాన్ సైనికులు.. సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ సైన్యం
* తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ వరుస సమీక్షలు
* పారా మిలిటరీ బలగాలకు సెలవులు రద్దు
ఆకేరు న్యూస్, డెస్క్ : ఉగ్రవాదుల ఆటకట్టించేందుకు భారత్ (Bharath) ముమ్మరంగా చర్యలు చేపట్టింది. తీవ్రమైన కసరత్తు చేస్తోంది. ఏరివేతకు శ్రీకారం చుట్టింది. పహల్గాం ఉగ్రదాడిలో ఆసిఫ్‌ఖాన్ (AsiFkhan) ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో పుల్వామా జిల్లా తాల్లోని ఉగ్రవాది ఆసిఫ్‌ఖాన్ ఇంటిని భారత్ సైన్యం పేల్చేసింది. అలాగే, బందిపొరాలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే టాప్ కమాండర్ హతమయ్యారు. లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని భద్రతాదళాలు మట్టుబెట్టాయి. పహల్గాం దాడి నిందితుల కోసం వెదుకుతుండగా, అల్తాఫ్ లల్లీ ఆచూకీ లభ్యమైంది. ఇదిలాఉండగా, జమ్మూకశ్మీర్ ఎల్వోసీ వద్ద పాకిస్థాన్ సైనికులు కాల్పులు జరిపారు. ఆ కాల్పులను భారత్ సైన్యం సమర్ధవంతంగా తిప్పి కొట్టింది. ఆర్మీ, పోలీసు దళాలు జాయింట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఆర్మీ ఛీప్ ఉపేంద్ర ద్వివేది శ్రీనగర్ చేరుకున్నారు. అవంతి పొరాలోని విక్టర్ ఫోర్స్ సైనిక కేంద్రానికి వెళ్లారు. ఆర్మీ కమాండర్లతో సమావేశం నిర్వహించారు. జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. సెలవుపై వెళ్లిన జవాన్లు వెంటనే రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పారామిలిటరీ బలగాలకు సైన్యం సెలవులను రద్దు చేసింది. శ్రీనగర్ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా నేడు ఢిల్లీ (Delhi) మార్కెట్లను బంద్ చేశారు. బంద్ సందర్భంగా మార్కెట్లు పూర్తిగా మూతబడ్డాయి.
………………………………………..