
* వరంగల్ సభ నేపథ్యంలో కేసీఆర్‌పై పాట
* విడుదల చేసిన కేటీఆర్, సంతోష్ కుమార్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్ ఎస్ సభను సక్సెస్ చేయడానికి ఆ పార్టీ శ్రేణులు విస్తృతంగా కృషి చేస్తున్నాయి. సభ నేపథ్యంలోనే గులాబీ బాస్ కేసీఆర్(KCR)పై తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఒక పాటను రూపొందించారు. జయ జయ జననేత.. తెలంగాణ జాతిపిత.. అనే లిరిక్స్‌తో సాగే ఈ పాటను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) శుక్రవారం ఆవిష్కరించారు. హైదరాబాద్ నందినగర్‌లోని నివాసంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ఈ పాటను ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దయాకర్ రెడ్డి, నేవూరి ధర్మేందర్ రెడ్డి, పల్లా ప్రవీణ్ రెడ్డి, వల్లమల్ల కృష్ణ, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల సతీశ్, కల్లెట్లపల్లి శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు. కాగా, మానుకోట ప్రసాద్ రచించిన ఈ పాటను సాకేత్ పాడారు. మిథున్ సంగీతం అందించారు. అలాగే, ఎంపీ సంతోష్ (mp Santhosh) కూడా ఎక్స్ వేదికగా పాటను విడుదల చేశారు. మన ప్రియతమ నేతకు ఈ పాట అంకితం.. పోస్ట్ చేశారు.
……………………………………………………