
* 28 మంది మావోయిస్టులు మృతి
ఆకేరున్యూస్, ఛత్తీస్గఢ్: తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దులో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందగా.. కేంద్ర పారామిలటరీ బలగాల నేతృత్వంలో ఐదు రోజులుగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ కీలకనేతలు హిడ్మా, దేవా టార్గెట్గా జరుగుతున్న ఈ ఆపరేషన్లో మూడు రాష్ట్రాల నుంచి 20 వేల మందికి పైగా బలగాలు పాల్గొన్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం కర్రెగుట్టలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకరకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మరణించారు. కర్రెగుట్టలో ఇంకా సుమారు వెయ్యి మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. గుట్ట సమీపంలోని ప్రజలు బయటకు రావొద్దని ఆంక్షలు విధించారు. ఇక మావోయిస్టుల కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా డ్రోన్ల సాయంతో ఏజెన్సీని భద్రతాబలగాలు జల్లెడ పడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజననులు భయాందోళనలకు గురవుతున్నారు.
………………………………………………..