
* 4,629 పాఠశాలల్లో నూటికి నూరు శాతం ఫలితాలు
* 2 పాఠశాలల్లో సున్నా శాతం ఫలితాలు
* మొత్తంగా 92.78 శాతం ఉత్తీర్ణత
* 99.29 శాతంతో మహబూబ్నగర్ జిల్లా టాప్
* 73.97 శాతంతో వికారాబాద్ జిల్లా లాస్ట్..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈరోజు విడుదల చేసిన టెన్త్ ఫలితాల్లో (10th class results) ఆసక్తి విషయాలు వెల్లడయ్యాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదల చేశారు. రవీంద్రభారతి (Ravindra Bharathi)లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో బుధవారం మధ్యాహ్నం 2.15 గంటకు రేవంత్ రెడ్డి విడుదల చేశారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మొత్తంగా 92.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, 4,629 పాఠశాలల్లోని విద్యార్థులు నూటికి నూరు శాతం ఫలితాలు పొందారు. అంతేకాదు.. గురుకులాల్లో 96 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. గత ఏడాదితో పోలిస్తే 1.47 శాతం అధికంగా ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 91.32 శాతం ఉత్తీర్ణత సాధించగా. బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణత పొందారు. ఈ సారి కూడా బాలికలదే పైచేయిగా నిలిచింది. బాలికల కంటే బాలురు 2.94 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. 4,629 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, రెండు పాఠశాలలు సున్నా శాతం ఫలితాలు పొందాయి. ఆ పాఠశాల్లోని టెన్త్ విద్యార్థులెవ్వరూ పాస్ కాలేదు. కాగా, మహబూబ్నగర్ జిల్లా (Mahaboobnagar District) 99.29 శాతంతో ప్రథమ స్థానంలో ఉండగా.. వికారాబాద్ జిల్లా (Vikarabad District) 73.97 శాతంతో చివరి స్థానంలో నిలిచింది.
………………………………………