* బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే
* ప్రజల నుండి వినతులు స్వీకరించిన కమిషనర్…
* టౌన్ ప్లానింగ్ ఫిర్యాదుల పరిష్కారం పై ప్రత్యేక శ్రద్ధ వహించండి…
ఆకేరున్యూస్, వరంగల్: ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అన్నారు. సోమవారం ప్రజావాణి (గ్రీవెన్స్) కార్యక్రమాన్ని పురస్కరించుకొని బల్దియా ప్రధాన కార్యాలయం లోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ హాజరై ప్రజల నుండి దరఖాస్తు లను స్వీకరించి పరిష్కారం కోసం ఆయా విభాగాల ఉన్నతాధికారులకు అందజేశారు. అనంతరం కమిషనర్ అధికారులకు తగు సూచనలు చేస్తూ నగర వ్యాప్తం గా డీసిల్టేషన్ పనులను వెంటనే ప్రారంభించి ప్రధాన నాల పనులను వారంలోగా పూడికతీత పూర్తి చేయాలని ఇందుకు సంబంధించి శానిటేషన్ ఇంజనీరింగ్ అధికారులు సమన్వయం తో వేగవంతం గా పూర్తి చేయాలని, ప్రజావాణి కార్యక్రమం లో భాగం గా టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన చాలా ఫిర్యాదులు పదే పదే పునరావృతం అవుతున్నాయని సరైన పరిష్కారం చూపక పోవడం వల్ల మళ్ళీ అవే ఫిర్యాదులు వస్తున్నాయని వాటిని పక్కగా అరికట్టాలని, ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల పరిష్కారం లో భాగం గా ప్రక్రియ పూర్తి అయిన దరఖాస్తు దారులకు వెంటనే ప్రొసీడిరగ్స్ అందించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా సి ఎం హెచ్ ఓ డా.రాజారెడ్డి డి ఎఫ్ ఓ శంకర్ లింగం ఇన్చార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్ డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి తదితరులు పాల్గొన్నారు.
…………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
