– విచారణ అనంతరం బాధ్యులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటాం
– డి ఎం హెచ్ వో అప్పయ్య
ఆకేరు న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న జరిగిన వైద్యుల నిర్లక్ష్యపు ఘటన పట్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్య , డి సి హెచ్ ఎస్ డాక్టర్ గౌతమ్ చౌహన్ సోమవారం ఆసుపత్రిలో విచారణ చేపట్టారు. బాధితురాలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం డిఎంహెచ్వో అప్పయ్య మీడియాతో మాట్లాడుతూ… ఆరోపణలన్నింటి పైన విచారణ చేపడతామని, విచారణ అనంతరం కలెక్టర్ కి నివేదిక సమర్పిస్తామని అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బాధ్యుల పైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
అధిక రక్తస్రావం అవ్వకుండా ఉండేందుకే బ్యాండేజీ
– కమలాపూర్ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ నరేష్
ఉప్పల్ గ్రామానికి చెందిన బాలింత ప్రసవానికి ఈనెల 27న ఆసుపత్రికి వచ్చిందని నార్మల్ డెలివరీ పాపకు జన్మనిచ్చిందని అన్నారు. ప్రసవం జరిగేటప్పుడు చిన్న కోత ఏర్పడిందని దాంతో డెలివరీ ప్రొసీజర్‌లో భాగంగానే బ్యాండేజీ వేసామనీ, రెండు రోజుల తర్వాత రివ్యూ కోసం మళ్లీ ఆసుపత్రికి రావాలని చెప్పినప్పటికీ, పేషంట్ కుటుంబీకులు తమకు చెప్పలేదని అంటున్నారని అన్నారు. ఈ విషయమే గైనకాలజిస్ట్ వివరణ కోరారని ప్రోటోకాల్ ప్రకారమే రక్త స్రావం జరగకుండా ఉండేందుకే బ్యాండేజీ తో చికిత్స చేసినట్లు గైనకాలజిస్ట్ తెలిపారని సుపరిండెంట్ నరేష్ అన్నారు.
………………………………………………….
