
* క్రైస్తవ సంఘాల శాంతి ర్యాలీ
ఆకేరున్యూస్, వరంగల్: ఇటీవల రాజమండ్రి ప్రాంతంలో క్రైస్తవ మత బోధకులు, పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యను నిరసిస్తూ బుధవారం గ్రేటర్ వరంగల్లో పెద్ద ఎత్తున శాంతి ర్యాలీని పబ్లిక్ గార్డెన్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేసిన దోషులను చట్టపరంగా శిక్షించాలని నినాదాలు చేశారు. పాస్టర్ కుటుంబాన్ని ప్రభుత్వాలు ఆదుకోవడంతోపాటు క్రైస్తవులపై, పాస్టర్లపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. పది రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో అమాయక ప్రజలపై జరిగిన మారణకాండను నిరసిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాదానికిప వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పిస్తూ శాంతి ర్యాలీ కొనసాగింది. శాంతి ర్యాలీలో గ్రేటర్ వరంగల్ చైర్మన్ బిషప్ డేనియల్ డి.కళ్యాణపు, వైస్చర్మన్ బి.ఏలియా. రెవ శ్రీనివాసనాయక్, కో కన్వీనర్ ప్లాంక్టిన్ సుధాకర్, మాజీ కార్పొరేటర్ బోడ డిన్నా, డాక్టర్ ప్రవీణ్, రెవ కాకిలేటి అబ్రహం, రెవ కె.అశోక్పాల్, బిషప్ జన్ను యిర్మియా. రెవ అరుణ్ జేమ్స్. రెవ సుప్రియ, కాజీపేట మండల పాస్టర్ ఫెలోషిప్ నుంచి రెవ మార్టిన్లూథర్, రెవ మార్క్ పీటర్, రెవ జి.ప్రతాప్, రెవ బి.కరుణాకర్, పాస్టర్ సువర్ణ రాజు, క్రైస్తవులు ఆధిక సంఖ్యలో పాల్గొన్నారు.
……………………………………..