
* పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు
* సోషల్మీడియాలో వీడియో వైరల్
ఆకేరు న్యూస్, డెస్క్ : మగాళ్లంటే ఇష్టం లేదని ఇద్దరు యువతులు పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్(Uttarpradhesh)లోని బదాయూ కోర్టు ప్రాంగణంలో జరిగింది. మూడు నెలలుగా కలిసి ఉంటున్న వీరు తొలుత కోర్టు ప్రాంగణంలో న్యాయవాదిని కలిశారు. తమకు న్యాయపరంగా సాయం అందించాలని కోరారు. స్వలింగ వివాహానికి చట్టం అంగీకరించదని లాయర్ తెలిపారు. తమకు పురుషులతో కలిసి జీవించడం ఇష్టం లేదని ఆ యువతులు చెప్పారు. అయినా తాము ఏమీ చేయలేనని న్యాయవాది చెప్పడంతో ఆ యువతులు కోర్టు ఆవరణలోనే దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు. అక్కడే ఉన్న న్యాయవాదులు చప్పట్లు కొడుతూ శుభాకాంక్షలు తెలిపారు. రెండు రోజుల క్రితం జరిగిన వారు దండలు మార్చుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
…………………………………………………