
* తెలంగాణలో కాంగ్రెస్ కమిషన్ సర్కార్
* ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన కేటీఆర్
ఆకేరున్యూస్, హైదరాబాద్: వరంగల్లో గురువారం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. మంత్రులు డబ్బులు తీసిన తర్వాతే ఫైళ్లపై సంతకాలు పెడతారని ఆమె చెప్పిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా శుక్రవారం స్పందించారు. కొండా సురేఖ మాట్లాడిన కొన్ని నిజాలకు అభినందనలు అని, తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ కవిూషన్ సర్కార్ నడుస్తోందని విమర్శించారు. 30 శాతం కమిషన్ లేకుండా ఫైళ్లపై మంత్రులు సంతకాలు పెట్టరని వారి సహచర మంత్రులే చెబుతున్నారని, సచివాలయం లోపల కాంట్రాక్టర్లు ధర్నాలు చేయడం చూస్తే, ఈ వ్యవస్థలో కమిషన్ వ్యవహారం ఎంత లోతుగా ఉందో స్పష్టమవుతోందన్నారు. మంత్రుల పేర్లను బహిర్గతం చేసి ప్రజలకు సత్యం చెప్పాలని కొండా సురేఖని కోరుతున్నానని, రేవంత్ రెడ్డి లేదా రాహుల్ గాంధీ, ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశిస్తారా? అంటూ కేటీఆర్ విమర్శల వర్షం కురిపించారు.
………………………………………………………………