
* మూడోరోజు తరలివచ్చిన భక్తులు
* పుణ్యస్నానం ఆచరించిన మంత్రి తుమ్మల
ఆకేరున్యూస్, కాళేశ్వరం: కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాలు ఘనంగా సాగుతున్నాయి. పుష్కర ఘాట్లో మూడో రోజు పుణ్యస్నానాలు ఆచరించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం రాత్రి గాలివాన బీభత్సం కారణంగా రహదారులన్నీ బురదమయంగా మారాయి. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ప్రత్యేక హెలికాప్టర్లో కాళేశ్వరానికి చేరుకోగా.. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పుణ్య స్నానం ఆచరించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలకు సహకరించారు.
……………………………….