
* వర్షానికి కుప్పకూలిన సదుపాయాలు
* ఏడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్
* సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం ఫెయిల్యూర్ అంటున్న భక్తజనం
* ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం రంగంలోకి దిగిన కలెక్టర్, ఎస్పీ
ఆకేరున్యూస్, కాళేశ్వరం: పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సరస్వతీ పుష్కరాలలో మూడవరోజు శనివారం కాళేశ్వరం భక్తుల తాకిడితో కిక్కిరిసిపోయింది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి త్రివేణి సంఘమంలో ఏర్పాటుచేసిన సౌకర్యాలు కుప్పకూలిపోయాయి. రోజురోజుకు భక్తుల తాకిడి పెరుగుతుందని గమనించిన అధికారులు మాత్రం సౌకర్యాల కల్పనలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో శనివారం మహాదేవపూర్ నుండి కాలేశ్వరం వెళ్లే రహదారిలో సుమారు 7 కిలోమీటర్లు ట్రాఫిక్ జాం ఏర్పడిరది. సుమారు మూడు గంటల పాటు పుష్కర స్నానానికి తరలివచ్చే భక్తులు ట్రాఫిక్ జామ్‌లో ఇ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి కలెక్టర్, ఎస్పీ రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
…………………………………….