
* మంటల్లో నాలుగు కుటుంబాలు
* ఘటనపై సీఎం ఆరా
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ మీర్‌చౌక్‌లోని ఓ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మంటలు సంబవించే సమయంలో ఆ భవనంలో నాలుగు కుటుంభాల్లోని 30 మంది ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రెస్క్యూ చేయబడిన వారిలో ఏడుగురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన వారిలో ముగ్గురు చిన్నారులు సహా 14 మంది ఉన్నట్లు సమాచారం.
ప్రమాద ఘటనపై సీఎం ఆరా..
ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
……………………………..