
* కలెక్టర్ డాక్టర్ సత్య శారద
ఆకేరున్యూస్, వరంగల్: కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణలో జాప్యానికి తావులేకుండా ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. ఆదివారం వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లోని చెన్నారావుపేట మండలం కేంద్రంలోని చెన్నారావుపేట, ముగ్దుంపురం, పాపయ్యపేట ధాన్యం కొనుగోలు కేంద్రాలను, జల్లి గ్రామ రైస్ మిల్ ను, నెక్కొండ మండల ధాన్యం కొనుగోలు కేంద్ర, సంగెం మండలంలోని తీగరాజుపల్లి, కాపుల కనపర్తి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించి సమర్ధవంతంగా నిర్వహించుటకు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు సంబంధిత అధికారులు కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని అన్నారు. ధాన్యం సేకరణను నిశితంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. రైతుల నుంచి ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం నిల్వలు, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు.
…………………………………………………….