
* బుట్టలు తయారు చేస్తూ, మట్టి బొమ్మలకు రంగులు వేస్తూ సందడి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ శిల్పారామంలో అందాల భామలు సందడి చేశారు. బతుకమ్మ ఆడిపాడారు. 72వ మిస్ వరల్డ్ ఫెస్టులో భాగంగా గరువారం అందగత్తెలంతా శిల్పారామాన్ని సందర్శించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వారికి స్వాగతం ఫలికారు. అక్కడ నుంచి బ్యాటరీ వాహనాలతో ఆవరణలోనున్న అన్ని విభాగాలను సందర్శించారు. తొలుత విలేజ్ మ్యూజిం,అక్కడున్న బతుకమ్మలను తిలకించారు. మిస్ వరల్డ్ (Miss World – 2025) పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన సుందరీమణులు శిల్పారామంలోని స్టాల్స్‌ను సందర్శించి.. వివిధ రకాల ఉత్పత్తులను గురించి అడిగి తెలుసుకున్నారు. బతుకమ్మ ఆడి సందడి చేశారు. బుట్టలు తయారు చేస్తూ, మట్టి బొమ్మలకు రంగులు వేస్తూ ఆకట్టుకున్నారు. ఆయా ఉత్పత్తులతో సెల్ఫీ ఫొటోలు దిగుతూ మురిసిపోయారు. తెలుగు సంప్రదాయం తమను ఆకట్టుకుందని వెల్లడించారు.
ఆట పాటలు
బృందావనంకు చేరుకున్న అందాల ముద్దుగుమ్మలు అక్కడున్న కోలాటం కళాకారులతో ఆడి పాడారు.. అక్కడ కళాకారులు ప్రదర్శనలో ఉంచిన కుండల తయారీలో వారూ చేతులు కలిపారు. బొమ్మలు వేస్తూ ఉల్లాసంగా గడిపారు. బందావనంలో చిన్నారులు బాలకృష్ణ వేషధారణ ఆకట్టు కుంది. సుమారు గంటపాటు అక్కడే గడిపిన వారు అనంతరం ఇందిరా మహిళా శక్తి బజార్‌కు చేరుకున్నారు. వివిధ నేరాల కింద జైలులో శిక్షలు అనుభవిస్తూ .. అక్కడి ఖైదీలు తయారు చేసిన వస్త్రాలను ,ఇతర ఉత్పత్తులను పరిశీలించిన సుందరీమణులకు ఆశాఖ డీజీపీ డాక్టర్ సౌమ్య మిశ్రా వివరించారు. రాష్ట్ర మహిళా స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అక్కడ వారితో జాయినై ఫోటోలు దిగారు. కాగా, టీ హబ్(T-Hub)లో నిర్వహించిన హెడ్ టు హెడ్ చాలెంజ్‌లో నాలుగు ఖండాల నుంచి 24 మంది విజేతలుగా నిలిచారు. టాప్ 24లో మిస్ ఇండియా నందిని గుప్తా చోటు దక్కించుకున్నారు. అమెరికన్, కరీబియన్, ఆఫ్రికా, యూరప్, ఏషియా, ఓసియానా ఖండాల వారీగా తదుపరి రౌండ్లకు విజేతలను ఎంపిక చేయనున్నారు. ఖండాల వారీగా టాప్‌లో నిలిచిన వాళ్లకు ఈ నెల 31న జరిగే మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలో చోటు దక్కనుంది.
…………………………………………