
* పుష్కర స్నానాలకు తరలివస్తున్న భక్తజనం
* సౌకర్యాల కల్పనకై అధికారుల వ్యయప్రాయాసలు
* వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్
ఆకేరున్యూస్, కాళేశ్వరం: దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పుష్కరాలలో ఎనిమిదవ రోజు వర్షం కురుస్తున్నా.. భక్తజన ప్రవాహం మాత్రం తగ్గలేదు. పలు ప్రాంతాల నుండి పుష్కరస్నానం ఆచరించేందుకు తండోపతండాలుగా భక్తులు కాళేశ్వర క్షేత్రానికి చేరుకుంటున్నారు. ఓవైపు వర్షం భక్తుల సౌకర్యం కోసం అధికారులు ఏర్పాటు చేసిన రోడ్లు, చలువ పందిళ్ళు, టెంట్లు, విద్యుత్తు, లాంటి అభివృద్ధి పనులను చిందర వందర చేసేస్తుంది. రోడ్లన్నీ బురదమయమై సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులకు కాస్త ఇబ్బందులు ఏర్పడ్డాయి. భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలు క్షేత్రంలో కలియ తిరుగుతూ అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సౌకర్యాల కల్పనకై వారు చేస్తున్న వ్యయ ప్రయాసలకు భక్తులు అభినందనలు తెలుపుతున్నారు. వర్షం కారణంగా పార్కింగ్ స్థలాలలో వాహనాలు నిలుపుటకు ఇబ్బందికరంగా మారడంతో గురువారం సైతం కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడిరది. మరో నాలుగు రోజులే పుష్కరాలు ఉండటంతో భక్తుల తాకిడి మరింతగా ఉంటుందని అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
……………………………..