* అమెరికా సంచలన నిర్ణయం
* స్లాట్ లు తాత్కాలిక నిలిపివేత
ఆకేరు న్యూస్, డెస్క్ : విదేశీ విద్యార్థులకు వీసాలు బంద్ చేస్తూ అమెరికా (AMERICA) సంచలన నిర్ణయం తీసుకుంది. ఎఫ్, జే, ఎమ్ వీసాల స్లాట్ లను తాత్కాలికంగా నిలిపేసింది. మళ్లీ ఇంటర్వ్యూలు ఎప్పుడు అనేది క్లారిటీ ఇవ్వకపోవడం గందరగోళానికి దారి తీస్తోంది. అయితే ప్రస్తుతం షెడ్యూల్ అయిన ఇంటర్వ్యూలు వరకూ ఓకే చెప్పింది. కొత్త వీసా అపాయింట్ మెంట్స్ చేయవద్దని ఎంబసీలకు అమెరికా ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న విద్యార్థులకూ కష్టాలు తప్పడం లేదని తెలుస్తోంది. క్లాసులకు డుమ్మా కొడితే వీసా రద్దు చేస్తామని వార్నింగ్ ఇస్తోంది. ఓపీటీ విద్యార్థులకు ఇమ్మిగ్రేషన్ విభాగం నోటీసులు పంపుతోంది. పని ప్రదేశం మారితే 10 రోజుల్లో అప్ డేట్ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. 15 రోజులు డెడ్ లైన్ విధించింది.
……………………………………………………

