* పిటిషన్లను కొట్టేసిన ధర్మాసనం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఓబుళాపురం మైనింగ్ కేసు(OBULAPURAM MINING CASE) లో నిందితుల పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది. సీబీఐ కోర్టును సవాల్ చేస్తూ గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. బెయిలు మంజూరు చేయాలని గాలి జనార్దన్ రెడ్డి(GALI JANARDHAN REDDY), అలీఖాన్ పిటిషన్ కోరారు. నిందితుల పిటిషన్ ను కొట్టి వేయాలని సీబీఐ కోర్టు కౌంటర్ దాఖలు చేసింది. నిందితుల పిటిషన్ పై విచారించేందుకు వెకేషన్ బెంచ్ నిరాకరించింది. జనార్దన్ రెడ్డితో పాటు మరో నలుగురి పిటిషన్లను కూడా తోసిపుచ్చింది. వేసవి సెలవులు తర్వాత రెగ్యులర్ కోర్టులోనే వాదనలు వింటామని తెలిపింది. దీంతో గాలి జనార్దన్ రెడ్డి ఊహించని షాక్ తగిలింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు (CBI COURT) ఇటీవలే సంచలన తీర్పు వెలువరించింది. ఈకేసులో గాలి జనార్దన్ రెడ్డి, మెఫజ్ అలీఖాన్, వీడీ రాజగోపాల్, బీవీ శ్రీనివాస్ రెడ్డి, ఓఎంసీ కంపెనీలను దోషులుగా తేల్చింది. ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. సుమారు 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసులో తీర్పు వెలువరించింది. తాజాగా నిందితులు వేసిన పిటిషన్లను ధర్మాసనం తోసిపుచ్చింది.
……………………………………….

