ఆకేరు న్యూస్, సూర్యాపేట : శిశువులను విక్రయిస్తున్న ముఠాను సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. శిశువును విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 16 నెలల మగ శిశువును పోలీసులు గుర్తించారు. శిశువును చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు పోలీసులు. ఇప్పటికే ఈ ముఠా 22 మంది శిశువులను విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. రాజస్థాన్(Rajasthan), ఉత్తరప్రదేశ్(Utharpradhesh), గుజరాత్(Gujarath) నుంచి శిశువులను ఇక్కడికి తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో శిశువును రూ. 3 లక్షల నుంచి రూ. 7 లక్షలకు అమ్ముతున్నట్లు తేలింది. పిల్లలు లేని తల్లిదండ్రులే లక్ష్యంగా వీరు దందా సాగిస్తున్నారు. పూర్తి వివరాల సేకరణకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
……………………………………………..

