
* ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆఫ్ ది రికార్డు కవిత వ్యాఖ్యలు నిజమే అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద ప్యాకేజీ దొరికితే కొందరు బీజేపీ నేతలు బీఆర్ ఎస్ తో కలిసిపోతారని తెలిపారు. బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. బీజేపీ నుంచి ఎక్కడ ఏ అభ్యర్థి నిలబడాలో బీఆర్ ఎస్ వాళ్లే డిసైడ్ చేస్తున్నారని అన్నారు. గతంలో ఇలా జరగడం వల్లే బీజేపీ నష్టపోయిందరి, లేకుంటే తెలంగాణలో ఎప్పుడో అధికారంలోకి వచ్చేదని తెలిపారు. ప్రతీ ఎన్నికల్లోనూ బీజేపీని కొంత మంది నేతలు బీఆర్ ఎస్ తో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. బీజేపీ ఎందుకు అధికారంలోకి రాలేదో పార్టీ నేతలు ఇప్పటికైనా ఆలోచించుకోవాలని అన్నారు. ఇతర పార్టీ నేతలతో మా పార్టీ నేతల కుమ్మక్కు అందరికీ తెలుసన్నారు.
———————