
* అందాల కిరీటం దక్కించుకున్న థాయ్‌లాండ్ యువతి
ఆకేరున్యూస్, హైదరాబాద్: 72వ మిస్ వరల్డ్ పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాత విజేతగా నిలిచింది. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని కైవసం చేసుకుంది. 107 దేశాలకు చెందిన అందాల భామలతో పోటీ పడి సుచాత విజేతగా నిలిచింది. మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలిచిన మొదటి థాయ్‌లాండ్ దేశస్తురాలు సుచాత కావటం విశేషం. సుచాత 2003, సెప్టెంబర్ 20న థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో జన్మించింది. కజోన్కిట్సకా స్కూల్లో ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. ప్రస్తుతం పాలిటిక్స్, ఇంటర్ నేషనల్ రిలేషన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తోంది. 2021 నుంచి అందాల పోటీల్లో పాల్గొంటోంది. గతంలో మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ 2024 విజేతగా నిలిచింది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మిస్ వరల్డ్ 2025 పోటీలు అట్టహాసంగా జరిగాయి. అంతకుముందు ఈ పోటీల్లో టాప్-8 నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా ఎలిమినేట్ అయ్యారు. టాప్ 8మందిలో మార్టినిక్, బ్రెజిల్, ఇథియోపియా, నవిూబియా, పోలెండ్, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ నిలిచాయి. ఖండాల వారీగా టాప్ ఇద్దరి నుంచి ఒక్కరిని షార్ట్ లిస్ట్ చేశారు. నువ్వు మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తావు అని అడిగిన ప్రశ్నకు 45 సెకన్లలో మెరుగైన సమాధానం ఇచ్చిన వారికి నిర్వాహకులు అవకాశం ఇస్తున్నారు. కంటెస్టెంట్ల సమాధానాలకు జడ్జిలు మార్కులు వేస్తున్నారు. 3వ రన్నర్ అప్ మిస్ మార్టినిక్, 2వ రన్నర్ అప్ మిస్ పోలాండ్, 1వ రన్నర్ అప్ మిస్ పోలెండ్లు నిలిచారు. గతేడాది 2024 మిస్ వరల్డ్‌గా నిలిచిన క్రిస్టినా పిజ్కోవా…72వ ప్రపంచ సుందరి ఓపల్ సుచాత చువాంగ్‌కు సంప్రదాయబద్ధంగా కిరీటాన్ని అలంకరించారు. ఇకపోతే ఈ మిస్ వరల్డ్-2025 పోటీలలో పోలెండ్ దేశానికి చెందిన యువతులు ఫస్ట్ రన్నర్ అప్‌గా.. సెకండ్ రన్నర్ అప్‌గా నిలవడం విశేషం. ఇదిలా ఉంటే మూడో రన్నర్ అప్ స్థానాన్ని మిస్ మార్టినిక్ నిలిచారు. ఇకపోతే మిస్ వరల్డ్‌గా ఎంపికైన ఓపల్ సుచాత చువాంగ్ శ్రీకి రూ. 8.5 కోట్ల ప్రైజ్ మనీని అందించనున్నారు.
……………………………………………………………………….