
* యూపీఐ ద్వారా తీసుకునే సౌకర్యం
ఆకేరు న్యూస్, డెస్క్ : యూపీఐ ద్వారా పీఎఫ్ ను విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కల్పించింది. ఈ కొత్త నిబంధనను నేటి నుంచే అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త విధానం ద్వారా పీఎఫ్ సభ్యులు ప్రావిడెంట్ ఫండ్ ను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు. అంతేకాదు.. EPFO 3.0 పేరుతో ఏటీఎం నుంచి కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ సౌకర్యం ప్రస్తుతం జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) సభ్యులకు పైలట్ ప్రాజెక్ట్‌గా అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త విధానం PF విత్‌డ్రాయల్ ప్రక్రియను మరింత తేలికగా, వేగవంతంగా చేస్తుంది. ముఖ్యంగా, పీఎఫ్‌ను పెన్షనర్లకు మరింత అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ఈ మార్పులను తీసుకొచ్చినట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది. EPFO 3.0 ప్లాట్‌ఫామ్ ద్వారా, PF విత్‌డ్రాయల్ ప్రక్రియ సరళీకృతం కావడంతో పాటు, KYC ప్రక్రియలు వేగవంతం అవుతాయి, క్లెయిమ్ ప్రాసెసింగ్ కూడా వేగంగా పూర్తవుతుంది. భవిష్యత్తులో ATM-వంటి కార్డులను కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించింది.
………………………………………..